: టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే
టీడీపీ ధిక్కార ఎమ్మెల్యే వేణుగోపాలాచారి నేడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు పార్టీ సభ్యత్వం అందించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వేణుగోపాలాచారిపై టీడీపీ ఇటీవలే స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను టీడీపీ కోరింది. వేణుగోపాలాచారి ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గం శాసనసభ్యుడు.