: చవకగా కోడిమాంసం, చేపలు అందిస్తున్న మమతా బెనర్జీ
తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలో ప్రవేశపెట్టిన 'రూపాయికే ఇడ్లీ' స్ఫూర్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చవకగా కోడిమాంసం అందిస్తున్నారు. మొబైల్ వ్యాన్ల ద్వారా కోడిమాంసం, తాజా చేపలు, పండ్లు చవకధరల్లో విక్రయించాలని మమత సర్కారు ఇటీవలే నిర్ణయించింది. మార్కెట్లో కిలో చికెన్ రూ.200 పలుకుతుండగా తాము అంతకంటే తక్కువకే అందిస్తున్నామని.. దెబ్బతో చికెన్ రేటు రూ.150కి దిగొచ్చిందని అధికారులు చెబుతున్నారు. కాగా, 21 వ్యాన్లలో ఈ చీప్ చికెన్, చేపలు విక్రయిస్తున్నామని ముఖ్యమంత్రి సలహాదారు ప్రదీప్ మజుందార్ తెలిపారు.