: కుక్క మొరిగిందని యజమానిపై కాల్పులు


దారినపోతున్నప్పుడు మనల్ని చూసి ఏదైనా కుక్క మొరిగిందనుకోండి.. 'చేయ్' అని అదిలించి వెళ్లిపోతాం. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ పట్టణం సమీపంలో చిత్రావలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సుమిత్ యాదవ్ అలా దులుపుకుని పోలేదు. ఈ రోజు ఉదయం సుమిత్ గ్రామంలో దారిన పోతుంటే.. అతడిని చూసి ఒక ఇంటి కుక్క మొరిగింది. దానిని సుమిత్ తీవ్ర అవమానంగా భావించాడు. ఇంటి ముందే నించుని ఉన్న సదరు పెంపుడు శునకం యజమాని అషార్ఫీ దేవి (60)ని పిస్టల్ తో కాల్చి పారేశాడు.

  • Loading...

More Telugu News