: తెలంగాణకు మాయావతి జై


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి జై కొట్టారు. తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. పనిలో పనిగా ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. మాయావతి 2011 జూన్ లో హైదరాబాద్ సభలోనూ తాము తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చిన్న రాష్ట్రాల వల్ల సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దళిత వ్యక్తే మొదటి ముఖ్యమంత్రి కావాలని నాటి సభలో ఆమె ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News