: 'మిథునం' చిత్రానికి 'భరతముని' పురస్కారం


వయసు మళ్ళిన దంపతుల సరదా జీవనాన్ని 'మిథునం' పేరిట శ్రీరమణ అక్షరబద్ధం చేయగా.. దాన్ని తనికెళ్ళ భరణి ఇటీవలే తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ మంచి చిత్రానికి భరతముని పురస్కారం దక్కింది. నేడు రవీంద్రభారతిలో నిర్వహించిన భరతముని సినీ అవార్డుల కార్యక్రమంలో 'మిథునం' సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. ఈ చిత్ర కథానాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉత్తమనటుడిగా.. శ్రీరమణ రచనాశైలికి నిలువుటద్దంలా నిలిచిన 'మిథునం' కథను అద్భుతరీతిలో సినిమాగా మలిచిన తనికెళ్ళ భరణి ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ, 'మిథునం' ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News