: వాయు కాలుష్యంతో 21లక్షల ప్రాణాలు హరీ!
ప్రకృతి పట్ల మానవుడి బాధ్యతారాహిత్యం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 21 లక్షల మంది వాయు కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలు ఆసియాలో ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం నిర్వహించిన అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు వీరి పరిశోధన 'ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ లెటర్స్' అనే పత్రికలో ప్రచురితమైంది.
మానవుడు సృష్టిస్తున్న కాలుష్యం వల్ల గాలిలోని సూక్ష్మ కాలుష్య కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి కేన్సర్, తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. వీటి కారణంగానే ఏటా లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. ఇక ఓజోన్ పొరకు చేస్తున్న హాని కారణంగా మరో 4.70 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు.