: నామినేషన్ పత్రాలు ఎత్తుకెళ్ళిన మావోయిస్టులు
విశాఖ జిల్లాలో మావోయిస్టులు తమ ఉనికిని చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మాడుగుల, బోయితలి ప్రాంతాల్లో అధికారుల నుంచి నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్ళారు. అంతేగాకుండా, స్థానిక ఎన్నికలను బహిష్కరించండంటూ సంఘటన స్థలంలో కరపత్రాలను వదిలివెళ్ళారు.