: వర్శిటీలు కావవి.. డబ్బు సంపాదించే యంత్రాలు: మోడీ


గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ తన వాగ్దాటితో మరోసారి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నేడు పుణేలోని ఫెర్గ్యుసన్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మోడీ.. పలు అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు. మునుపటి రోజుల్లో విశ్వవిద్యాలయాలు విద్యాదానానికి ప్రాధాన్యం ఇచ్చేవని, నేడు వర్శిటీలు డబ్బులు సంపాదించే యంత్రాలుగా రూపాంతరం చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనదేశంలో ప్రపంచస్థాయికి ఎదిగిన విద్యాసంస్థ ఒక్కటీ లేదని పెదవి విరిచారు.

నేటి యువతలో దేశానికి ఏదైనా మేలు చేయాలన్న తపన కనిపిస్తోందని అన్నారు. ఐటీ రంగంలో యువత ప్రతిభ వల్లే భారత్ ను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. చైనా వలే మనకు స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదని వ్యాఖ్యానించారు. తత్ఫలితంగా కామన్వెల్త్ క్రీడలనూ సవ్యంగా నిర్వహించలేకపోయామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News