: మౌనం వీడని గులాబీ బాస్.. అయోమయంలో టీఆర్ఎస్


తెలంగాణ అంశం ఎప్పుడు పతాకస్థాయికి ఎగిసినా నేనున్నానంటూ తెరపైకి వచ్చే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మౌనం దాల్చారు. కోర్ కమిటీ భేటీ పేరిట కాంగ్రెస్ మరోమారు ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని సాగదీసినా.. ఈ గులాబీ బాస్ లో స్పందన కరవైంది. కారణమేంటో టీఆర్ఎస్ నేతలకే అర్థంకాక జట్టు పీక్కుంటున్నారు! జూన్ 30న కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నిజాం కళాశాలలో రాష్ట్ర సాధన పేరిట భారీ సభ నిర్వహించినప్పటినుంచి కేసీఆర్ మౌనముద్ర దాల్చారు. తెలంగాణపై అటో ఇటో తేల్చేస్తామంటూ కాంగ్రెస్.. కోర్ కమిటీ భేటీకి రంగం సిద్ధం చేస్తున్నప్పుడైనా, కేసీఆర్ రంగప్రవేశం చేసి ఉంటే.. సోనియా అండ్ కో పై ఒత్తిడి పెంచే వీలుండేదని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.

ఆఖరికి కోర్ కమిటీ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రంపై ఏమీ తేల్చకపోవడంపైనా, తమ అధినేత నోరు విప్పకపోవడం వారిని అయోమయానికి గురిచేస్తోంది. దీంతో, ఇప్పటివరకు టీఆర్ఎస్ తో అంటకాగిన తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు మరికొన్ని ప్రజా సంఘాలు కాంగ్రెస్ బాట పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అధినేత మౌనంగా ఉండడంతో పార్టీ అగ్రనేతలు సైతం గుంభనంగా నెట్టుకొస్తున్నారు. హరీశ్ రావు, కేటీఆర్, నాయిని వంటి నేతల్లో ఒక్కరు కూడా కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అనంతరం మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News