: బాలికల విద్యే నా ప్రాణం: మలాలా


బాలికల హక్కుల కోసం పోరాడిన కార్యకర్తలా గుర్తుండిపోవాలే గానీ, తాలిబన్ల కాల్పులకు గురైన బాలికలా కాదని పాక్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్(16) పేర్కొంది. బాలికల విద్యా హక్కు కోసం పోరాడుతూ తాలిబన్ల కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డ మలాలా ఐక్యరాజ్యసమితిలో శనివారం ప్రసంగించింది. బాలికల విద్య కోసం తన జీవితం అంకితం అని ప్రకటించింది. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, 'విద్య చిన్నారుల హక్కు' అని అందరికీ చెప్పడం కోసమే వచ్చానని స్పష్టం చేసింది. ఈ నెల 12న మలాలా తన 16వ పుట్టిన రోజును ఐక్యరాజ్యసమితిలో జరుపుకుంది. ఆ రోజును 'మలాలా డే' గా ఐక్యరాజ్యసమితి నిర్వహించింది.

  • Loading...

More Telugu News