: తల్లికాదు పూతన!
ఎప్పుడో కృష్ణుడిని చంపేందుకు వచ్చిన పూతన పసిపిల్లలకు పాలిచ్చే నెపంతో విషం ఇచ్చి చంపేదని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే ఈ తల్లి మాత్రం నిజంగా పూతనలాగే ప్రవర్తించింది. అదికూడా కన్నబిడ్డ విషయంలోనే.
మామూలుగా తల్లులు తమ పిల్లలకు పాలిచ్చే సమయంలో పిల్లలు కొరికితే మెత్తగా మందలిస్తూ అందులో కూడా మాధుర్యాన్ని చవిచూస్తారు. అయితే ఈ తల్లి మాత్రం పాలు తాగుతూ తనను కొరికాడని కన్న బిడ్డను కత్తెరతో పొడిచింది. అదికూడా ఒకసారి కాదు ఏకంగా తొంభైసార్లు పొడిచింది. చైనాలోని ఒక తల్లి తన ఎనిమిది నెలల కొడుకు పాలు తాగుతూ కొరికాడని ఏకంగా వాడి ముఖంపై ఇలా గాయపరిచింది. తీవ్ర గాయాలతో నెత్తుడి మడుగులో విలవిలలాడుతున్న ఆ బాబును బంధువు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు జియావోబావో ముఖంపై వందకు పైగా కుట్లు వేశారు. ప్రస్తుతానికి సదరు బాబు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా...?