: రాహుల్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ లో భిన్న స్వరాలు


రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదు కదా అని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అంటుండగా.. ఆయనే తమ భావి ప్రధాని అభ్యర్థి అని పార్టీ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది చెబుతున్నారు. దిగ్విజయ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ద్వివేది స్పందిస్తూ.. ఆ మాటలు దిగ్విజయ్ వ్యక్తిగతమని తెలిపారు. ఇటీవలే జైపూర్లో జరిగిన 'చింతన్ శివిర్'లో రాహుల్ అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చారని, పార్టీ ప్రచార సారథిగా అధికారికంగా ప్రకటించాల్సి ఉందని పేర్కొన్నారు. దిగ్విజయ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, సాధారణ ఎన్నికలకు ముందు ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లను ప్రకటించదని అన్నారు.

  • Loading...

More Telugu News