: కాంగ్రెస్ తిట్లదండకం.. వైఎస్సార్సీపీ దాడి


కోస్తాంధ్రలో పంచాయతీ సెగ రాజుకుంటోంది. పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి దాడులు, ప్రతిదాడులతో గ్రామాలు అట్టుడుకుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేలుపుచర్లలో కాంగ్రెస్ అభ్యర్ధి తిట్లదండకానికి వైఎస్సార్సీపీ ఎదురుదాడితో సమాధానం చెప్పింది. వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో సుచేశ్వర్రావు(50) తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స కోసం విజయవాడ తరలించారు. గాయపడ్డ మరో నలుగురు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కాంగ్రెస్ వర్గీయులు వైఎస్సార్సీపీ అభ్యర్ధిని దూషించడంతో గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇరు పక్షాలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

  • Loading...

More Telugu News