: హైదారాబాద్ మరోసారి 'టెర్రర్' టార్గెట్ అయిందా?
హైదరాబాద్ మరోసారి ఉగ్రవాదులకు టార్గెట్ గా మారిందా? నిఘా వర్గాల హెచ్చరికలు అవుననే అంటున్నాయి. బీహార్లోని బుద్ధగయలో పేలుళ్ళ అనంతరం కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు పలు నగరాలను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఉగ్రవాదులు హైదరాబాదులోని ప్రముఖ పర్యాటక స్థలాలను లక్ష్యంగా ఎంచుకోవచ్చని నిఘా సంస్థలు పేర్కొన్న నేపథ్యంలో నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. లుంబిని పార్కు, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. సందర్శకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీసీపీ తెలిపారు.