: 'ఆహార భద్రత పథకం' రాజీవ్ జన్మదినం నుంచి అమల్లోకి: కేంద్రం


కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత పథకం ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మదినం సందర్భంగా అమల్లోకి రానుంది. అధినేత్రి సోనియా నివాసంలో నేడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆహార శాఖ మంత్రి కేవీ థామస్, పార్టీ ముఖ్య నేతలు, కోర్ కమిటీ సభ్యులు, 14 మంది కాంగ్రెస్ సీఎంలతో పాటు ఏఐసీసీ కార్యవర్గం యావత్తూ పాల్గొంది.

ఈ భేటీ గురించి కాంగ్రెస్ సమాచార విభాగం ఇన్ ఛార్జి అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ఇంతకుముందు రాష్ట్రాలు కేంద్రం నుంచి కేజీ బియ్యాన్ని కొనేందుకు రూ.5 రూపాయలు వెచ్చించాల్సి వచ్చేదని, ఆహార భద్రత పథకం అమల్లోకి వస్తే కేజీ బియ్యం రూ.3లకే పొందవచ్చని వివరించారు. తద్వారా నిధులను ఆదా చేయవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News