: సుష్మా స్వరాజ్ తో భేటీ అయిన కేంద్ర హోం మంత్రి షిండే
బీజేపీ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సమావేశం అయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ అస్త్రాల్లో ఒకటైన కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చకు పట్టుబడతామని ఇప్పటికే సుష్మాస్వరాజ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో షిండే ఆమెతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో షిండేతో పాటు పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్ నాథ్ కూడా పాల్గొన్నారు. వీవీఐపీ హెలికాఫ్టర్ల కొనుగోలు వ్యవహరంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని షిండే ప్రకటించినట్లు తెలుస్తోంది.