: స్నోడెన్ అభ్యర్థన మాకందలేదు: రష్యా
అగ్రరాజ్యం అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన ఎన్ఎస్ఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ రష్యా ఆశ్రయం కోరగా.. అతడి అభ్యర్థన తమకు అందలేదని రష్యా అంటోంది. గత కొన్ని వారాలుగా మాస్కో విమానాశ్రయంలో తలదాచుకుంటున్న స్నోడెన్ కు ఆశ్రయమిస్తామంటూ వెనిజులా, బొలీవియా, నికరాగువా వంటి లాటిన్ అమెరికా దేశాలు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాలకు వెళ్ళేంతవరకు తనకు ఆశ్రయమివ్వాల్సిందిగా స్నోడెన్ రష్యా ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయమై స్పందించిన రష్యా ఇమ్మిగ్రేషన్ ఛీఫ్ కాన్ స్టాంటైన్ రమదనోవ్ స్కీ తమకు స్నోడెన్ నుంచి ఎలాంటి విన్నపమూ అందలేదని స్పష్టం చేశాడు.