: 'ఒరిజినల్ ధోనీ' గురించి ఎవరికీ తెలియదు: గవాస్కర్


ధోనీ మనస్తత్వం గురించి గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ అసలు వ్యక్తిత్వం గురించి అతని ఆప్తులకు కూడా పెద్దగా తెలిసుండదని అన్నాడు. విండీస్, శ్రీలంక ట్రైసిరీస్ ఫైనల్లో ధోనీ ఆడతాడని ఎవరూ ఊహించలేదని, తానేం చేయాలనుకుంటాడో అదే చేస్తాడని గవాస్కర్ అన్నారు. తొలి మ్యాచ్ లో కండరాలు పట్టేయడంతో విశ్రాంతి కోరుకున్న టీమిండియా రెగ్యులర్ సారథి.. ఆ బాధ వేధిస్తున్నా ఫైనల్లో ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చాడని కితాబిచ్చారు. తన నిర్ణయాలను ఎవరితోనూ పంచుకోని ధోనీ గురించి, అతనికి అత్యంత సన్నిహితులు అని చెప్పేవారికి కూడా పెద్దగా తెలిసి ఉండదని సన్నీ అభిప్రాయపడ్డారు.

బయటికి సింపుల్ గా కనిపించే ధోనీ, అంతర్గతంగా ఉండే ధోనీ ఒకేలా వుండరని చెప్పుకొచ్చాడీ మాజీ కెప్టెన్. ఆ విలక్షణ తత్వంతోనే 53 బంతుల్లో 46 పరుగులు చేసిన ధోనీ.. ఎరంగా వేసిన చివరి ఓవర్లో కేవలం మూడు బంతుల్లోనే 16 పరుగులు సాధించాడని అన్నారు. అలుపెరుగని బాటసారిలా పరుగులు, విజయాలు సాధించుకుంటూ పోయే ధోనీ.. భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడిస్తుంటాడని గవాస్కర్ అభినందించారు.

  • Loading...

More Telugu News