: ప్రభుదేవా 'ఏబీసీడీ' రీమేక్ లో నటించనున్న గాంగ్నమ్ స్టయిల్ ఫేమ్ సై
సినీ డ్యాన్సులకు కొత్త ఒరవడి దిద్దిన ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం 'ఏబీసీడీ'. 3డి పరిజ్ఞానంతో నిర్మించిన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ఇప్పుడీ సినిమాను కొరియా భాషలో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇందులో ప్రభుదేవా పోషించిన పాత్రలో గాంగ్నమ్ స్టయిల్ పాటతో ప్రపంచ వ్యాప్త ఆదరణ సొంతం చేసుకున్న సై నటించనున్నాడు. దక్షిణ కొరియాకు చెందిన ఓ ప్రొడక్షన్ సంస్థ 'ఏబీసీడీ' నిర్మించిన యూటీవీ నుంచి రీమేక్ హక్కులు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.