: ఖమ్మంలో కాలం చెల్లిన భవనాలు 250
ఖమ్మం పట్టణంలో కాలం చెల్లిన 250 భవనాలను అధికారులు గుర్తించారు. ఈమేరకు పాత భవనాలు కూల్చేయాలంటూ భవన యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. హైదరాబాదులో సిటీలైట్ హోటల్ కూలిపోవడంతో అలాంటి ఘటనలు ఖమ్మంలో జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడంతో, భవన యజమానులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకముందే మేల్కోవాలని సూచిస్తున్నారు.