: తెలంగాణపై ఇక సంప్రదింపులు ఉండవు: దిగ్విజయ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇక ఎటువంటి సంప్రదింపులు ఉండబోవని ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. నిర్ణయమే తరువాయన్నారు. త్వరలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.