: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1,2 విలీనం ఈ ఏడాది లేనట్లే!
నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురందించింది. గ్రూప్-1, గ్రూప్-2లకు సంబంధించి ఈ ఏడాదికి మాత్రం గతంలో పరీక్షలు నిర్వహించిన రీతిలో పాత పద్దతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. గ్రూప్-2 కి చెందిన ఎగ్జిక్యూటివ్ హోదా కలిగిన ఉద్యోగాలను గ్రూప్-1 లో కలిపేస్తూ, వాటిని గ్రూప్-1(బి) గా పిలుస్తూ గత డిసెంబరులో నిర్ణయం తీసుకుంది. దీనిపై పలు వర్గాల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని అధికారులు వెల్లడించారు. అయితే, వచ్చే ఏడాది నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ కొత్త పద్దతిలోనే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.