: కేఫ్ లో ఆత్మాహుతి దాడి.. ఇరాక్ లో 47 మంది బలి


ఇరాక్ మరోసారి రక్తసిక్తమైంది. కిర్కుక్ పట్టణంలోని ఓ కేఫ్ లో గతరాత్రి ఆత్మాహుతి దాడి జరగడంతో 47 మంది బలయ్యారు. రంజాన్ మాసం సందర్బంగా ఇఫ్తార్ విందు కోసం కేఫ్ లో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో మరో 29 మంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఓ క్షతగాత్రుడి కథనం ప్రకారం.. ఓ లావుపాటి వ్యక్తి కేఫ్ లో ప్రవేశించి.. 'అల్లాహో అక్బర్' అంటూ తనను తాను పేల్చేసుకున్నాడని వివరించారు. కాగా, ఘటనకు కారకులెవరన్నది ఇంకా తెలియరాలేదు. అయితే.. సున్నీ, షియా తెగల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగివుండొచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News