: పంచాయతీ ఎన్నికలకు వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రాలు
పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ ఖమ్మం జిల్లా చింతూరు మండలంలోని బుర్ఖాన్ కోట బస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై మావోయిస్టు కమిటీ పేరుతో కరపత్రాలు వేశారు. ఈ నెల 23 నుంచి రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని కరపత్రాల్లో మావోయిస్టులు హెచ్చరించారు. ఆదివాసీ గ్రామాలపై పోలీసు దాడులు నిలిపివేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను గ్రామస్థులు నిలదీయాలని మావోయిస్టులు సూచించారు.