: 'అభి' సినిమా హీరో కమలాకర్ కన్నుమూత
వర్థమాన తెలుగు సినీనటుడు కమలాకర్ అనారోగ్యంతో కన్నుమూసాడు. నరాలకు చెందిన వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి కి చెందిన బూచేపల్లి కమలాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అభి, సన్నీ, హాసిని, సంచలనం సినిమాల ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు సుపరిచితుడు. తాజాగా కమలాకర్ నటించిన 'బ్యాండ్ బాలు' విడుదలవ్వాల్సి ఉంది. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన కమలాకర్ కు 37 ఏళ్లు.