: కొవ్వు కరిగించే కొత్త మూతి!


వయసు పెరిగే కొద్దీ ముఖంపైన ముడతలు వస్తుంటాయి. అలాగే మన శరీరంలో కూడా చెడు కొవ్వు పేరుకుపోతుంటుంది. ముఖంపైన ముడతల కారణంగా మరీ పెద్దవారిలా కనిపిస్తుంటాం. ఈ ముడతలు తగ్గించుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. మరీ ఎక్కువగా ఫీలయ్యేవారు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకునేందుకు కూడా వెనుకాడరు. అయితే ఇంత శ్రమ లేకుండా, కేవలం చిన్న మూతి లాంటి పరికరంతో మీ ముఖంపైని కొవ్వును కరిగించుకోవచ్చట. శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త పరికరంతో మీ ముఖంపైని కొవ్వుని కరిగించుకోవడంతోబాటు ముఖంపైని ముడతలు కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ముఖంపైని వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవడానికి ఒక చిన్న పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం మన పెదవుల్లాగా ఉంటుంది. దీన్ని నోటికి బిగించుకుని మనం ఏ భాషలోనైనా అచ్చులను వల్లెవేస్తే చాలు. ఇక మీ ముఖంపైని ముడతలు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూతి ఆకారంలో ఉండే ఈ పరికరం ధర సుమారు రూ.3500. ఈ పరికరాన్ని మూతికి తగిలించుకుని రోజుకు ఓ మూడు నిమిషాలు ఇలా అచ్చులు చెబితే చాలు. ఒకవేళ అచ్చులు వద్దనుకున్నా నోరు ఆడిస్తే సరిపోతుంది. ఎంచక్కా మీ ముఖంపైని ముడతలు తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ముడతలను తగ్గించే ఈ పరికరం పేరేమిటో తెలుసా... 'ఫేస్‌ స్లిమ్మర్‌'!

  • Loading...

More Telugu News