: ముషారఫ్ పై మరో కేసు


మూలిగే నక్కపై తాటిపండు పడ్డ .. చందంలా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మీద కేసుల మీద కేసులు వచ్చి పడుతున్నాయి. లాల్ మసీదు ఘటనలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా ఆదేశించింది. 2007లో ఆ మసీదు ఘాజీ అయిన అబ్దుల్ రషీద్ ను మిలిటరీ ఆపరేషన్ ద్వారా చంపివేసిన కేసులో ముషారఫ్ ను నిందితుడిగా పేర్కొంటూ రషీద్ కుమారుడు హరూన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ఇస్లామాబాద్ హైకోర్టు ముషారఫ్ పై కేసు నమోదు చేయాలని పేర్కొంది. ఇటీవలే ప్రవాసం వీడి, స్వదేశం చేరిన ముషారఫ్ ను పలు కేసులు చుట్టుముట్టాయి. న్యాయమూర్తుల తొలగింపు కేసు, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసుల్లో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News