: విజయవాడలో తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సీమాంధ్ర మద్దతుదారులు నిరసనలు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బంద్ సందర్భంగా విజయవాడలో వాణిజ్యకేంద్రాలన్నీ స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. సీమాంధ్ర జిల్లాలన్నింట్లోనూ ప్రశాంతంగా బంద్ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బస్ లు అడ్డుకున్నప్పటికీ, అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా నిరసనలు వ్యక్తం చేశారు.