: 'నేను హిందూ జాతీయవాది'నంటున్న మోడీ
తాను హిందూ జాతీయవాదినని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ప్రచారక్ నరేంద్ర మోడీ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ ప్రచారక్ గా నియమితులైన తరువాత మొదటిసారి రాయిటర్స్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను హిందూ జాతీయవాదినని, అందుకు కారణం హిందువుగా పుట్టడమేనని ఆయన తెలిపారు. అలాగే తనను ప్రగతిశీలవాది, అభివృద్ధి కాముకుడినని అంటారని, పని రాక్షసుడు అని కూడా అంటారని చెప్పుకున్నారు. ప్రగతిశీల భావనతో పని చేస్తే వైరుధ్యాలు ఎక్కడుంటాయని ఆయన ప్రశ్నించారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఒక్కరికీ ఆలోచించే స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు.