: ముగిసిన కోర్ కమిటీ భేటీ
అందర్లోనూ ఉత్కంఠ రేపుతున్న కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ ముగిసింది. ఢిల్లీలో ప్రధాని నివాసంలో దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశంపై చర్చించారు. కాగా, భేటీ ముగిసిన వెంటనే సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స ప్రధాని నివాసం నుంచి వెలుపలికి వచ్చారు. అక్కడి నుంచి వారు ఏపీ భవన్ కు పయనమైనట్టు తెలుస్తోంది. ఇక, వీరు ముగ్గురూ సమర్పించిన రోడ్ మ్యాప్ నివేదికలపై మన్మోహన్, సోనియా, రాహుల్, దిగ్విజయ్, ఆజాద్, ఆంటోనీ తదితరులు కీలక కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.