: టీమిండియా టాప్ ర్యాంకు మరింత పదిలం
ఇంగ్లండ్ లో చాంపియన్స్ ట్రోఫీ, కరీబియన్ దీవుల్లో ముక్కోణపు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంకును మరింత పదిలపరుచుకుంది. ఐసీసీ నేడు విడుదల చేసిన టీమ్ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ 122 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (114), ఇంగ్లండ్ (112) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.