: కౌంటర్ దాఖలు చేసిన కళంకిత మంత్రులు


మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి నేడు సీబీఐ న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ కంపెనీల్లో వాన్ పిక్, దాల్మియా సిమెంట్స్ పెట్టుబడుల వ్యవహారంలో వీరిద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ ఇంతకుముందు మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన వీడియో టేపులను సీబీఐ కోర్టులో సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వీడియోలను పరిశీలించిన తర్వాతే తాము తమ వాదనలను వినిపిస్తామని ధర్మాన, సబిత కోర్టుకు విన్నవించారు. టీవీ9 ప్రసారం చేసిన వీడియోలను పరిశీలించిన పిదప వారిద్దరూ ఈ రోజు సీబీఐ న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News