: చివరి ఓవర్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా: ధోనీ
ఫైనల్ మ్యాచ్. శ్రీలంక ఇచ్చిన 202 పరుగుల విజయ మార్కును అందుకోవాలంటే భారత జట్టు ఇంకా 15 పరుగులు చేయాలి. చేతిలో ఉన్నది ఒకే వికెట్.. మిగిలి ఉన్నది ఆరు బంతులు(ఒక ఓవర్). గాయం తర్వాత జట్టులోకి వచ్చి చేరిన కెప్టెన్ ధోనీ తన అనుభవాన్ని రంగరించి 15 పరుగులు పిండుకుని విజయహారాన్ని భారత్ మెడలో వేశాడు. చివరి ఓవర్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని విజయం అనంతరం ధోనీ మీడియాకు చెప్పాడు. బౌలర్ ఎరంగ అంత అనుభవజ్ఞుడు కాకపోవడంతో బ్యాటుకు పనిచెప్పానన్నాడు. క్రికెటర్ గా తనకు, తన జట్టుకు ఉన్న అనుభవం విజయ సాధనకు తోడ్పడిందని చెప్పాడు.