: రాయల్ చాలెంజర్స్ పగ్గాలు చేపట్టనున్న విరాట్ కోహ్లీ
ఐపీఎల్ ఆరవ సీజన్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరికొద్ది నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ టోర్నీలో పాల్గొనే బెంగళూరు జట్టుకు కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేసినట్టు రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం బుధవారం ప్రకటించింది. కాగా, గత సీజన్ లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు న్యూజిలాండ్ స్పిన్నర్ డానియల్ వెటోరీ కెప్టెన్ గా వ్యవహరించాడు.