: రాష్ట్రంలోను.. దేశంలోనూ దండిగా వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీనివల్ల గత 24 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో రుతుపవనాలు మరింత చురుగ్గా ఉన్నట్లు విశాఖలోని తూపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఈ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది.

హైదరాబాద్ లో 10 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా ఎల్లంకిలో 11, ఖమ్మం జిల్లా వాజేడులో 10, మెదక్ జిల్లా నక్కపల్లిలో 10, వరంగల్ జిల్లా తాడ్వాయిలో 9 సెంటీమీటర్ల వర్షం గత 24 గంటల్లో పడింది. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగానూ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, అసోం, బీహార్, ఒడిసా తదితర రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ లో 127 మంది వర్షాల కారణంగా మృతి చెందారని సమాచారం.

  • Loading...

More Telugu News