: హైదరాబాద్ లో భారీ వర్షాలు
రాజధాని జంట నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉండడంతో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు.