: 'మిస్టర్ పెళ్లికొడుకు' ఆడియో రిలీజ్
సునీల్ , ఇషాచావ్లా హీరో హీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ పెళ్లికొడుకు' ఆడియో రిలీజ్ ఇవాళ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు వి.వి. వినాయక్, సంపత్ నందిలతో పాటు, హీరో నాగచైతన్య, హీరోయిన్ తమన్నా అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాకి ఎస్.ఎ. రాజ్ కుమార్ అందించిన బాణీలు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.