: సౌదీ యువరాణికి అమెరికాలో అరదండాలు


ఓ మహిళను అక్రమంగా నిర్భంధించిందన్న ఆరోపణలపై సౌదీ అరేబియా యువరాణి మేషల్ అల్ అబాన్ ను అమెరికాలో అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఈ రాకుమారి.. కెన్యాకు చెందిన ఓ మహిళ (30)ను అక్రమంగా అమెరికా తరలించడమే కాకుండా, ఆమె పాస్ పోర్టును సైతం లాగేసుకుని, వెట్టిచాకిరీ చేయించుకుంటోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో నేరం రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం 12 ఏళ్ళ వరకు కారాగార శిక్ష పడొచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News