: పార్టీల కుల రాజకీయాలపై అలహాబాద్ హైకోర్టు వేటు


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కులసభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఇటీవలే బ్రాహ్మణుల మహా సమ్మేళనం పేరుతో ఒక సభను లక్నోలో నిర్వహించింది. దీంతో ఇలాంటి వాటిని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం అలహాబాద్ హైకోర్టు నిషేధం విధిస్తూ తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. కులాధారిత సభల వల్ల సమాజం ముక్కలవుతుందని, అటువంటి వాటిని రాష్ట్రంలో నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News