: ఉండవల్లి ఓ డయ్యర్: హరీష్ రావు
కాంగ్రెస్ నేత, ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దీటుగా స్పందించారు. ఉండవల్లి డయ్యర్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ఆగబోదన్నారు.