: ఎస్సై భార్య కుచ్చుటోపీ


అసలే ఎస్సై భార్య, జనాన్ని బాగుచేస్తానంటూ చిట్టీలు వేయించింది. సరే, అధికారి భార్య కదా అన్న అభిమానం ఒకవైపు, అడిగాక వేయకపోతే ఏ తలనొప్పి వస్తుందోనన్న శంక మరోవైపు ఉండడంతో వారంతా చిట్టీలు వేశారు. తీరా భారీగా డబ్బు పోగయ్యాక ఆ ఎస్సై భార్య అనుకున్నంత పనీ చేసింది. వారికే కుచ్చుటోపీ పెట్టింది. దీంతో బాధితులు మాకు దారి చూపండి బాబో అంటూ పై అధికారులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం కంట్రోల్ రూం ఎస్సైగా పల్లపు పుల్లయ్య పని చేస్తున్నారు. అతని భార్య పుష్పలీల చిట్టీల పేరిట తన చుట్టుపక్కల ఇళ్ల జనం నుంచి డబ్బు వసూలు చేసింది. సుమారు 17 లక్షల రూపాయలు పోగయ్యాక ఆమె మాట మార్చి బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News