: అధిష్ఠానం మదిలో రాయల తెలంగాణ లేదు: గండ్ర


కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మదిలో రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన లేదని ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అది కేవలం ఎంఐఎం ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్ లో సభలు, సమావేశాలను రద్దు చేసుకోవాలని కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపైనే చర్చ ఉంటుందని గండ్ర చెప్పారు. సాధారణంగా గండ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విధేయంగా ఉంటారు. ఇప్పుడు తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణకు అనుకూలంగా స్పష్టంగా మాట్లాడడాన్ని చూస్తే తెలంగాణ ఏర్పాటుపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News