: అగ్ని కీలల్లో కాశ్మీర్ సచివాలయం
కాశ్మీర్లోని ప్రభుత్వ సచివాలయ ప్రాంగణంలోని ఒక భవనంలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. కీలక పత్రాలన్నీ మంటల్లో కాలి బూడిదై ఉంటాయని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.