: నేతలపై మావోయిస్టుల దాడులు
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఈ తెల్లవారుజామున దాడులకు పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపును ఖాతరు చేయని నేతలపై ప్రతాపం చూపారు. గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లిలో మాజీ జెడ్పీటీసీ మచ్చరాజును చితకబాదారు. అనంతరం అతడి ఇంటికి నిప్పంటించారు. అలాగే మరో కాంగ్రెస్ నేత మంగళపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు బాబూరావును అపహరించుకుపోయారని సమాచారం.