: నాసా రూటే వేరు


సాధారణంగా ప్రభుత్వ సంస్థలకు చిన్న పిల్లల నుండి ఉత్తరాలు వంటివి వస్తే వాటిని చదువుకుని హాయిగా నవ్వుకుని పక్కన పడేస్తారు. కానీ, అమెరికా అంతరిక్షయాన సంస్థ నాసా రూటే వేరు. అది చిన్న పిల్లవాడు రాసిన ఉత్తరం అని తెలిసినా చక్కగా దానికి బదులు పంపింది. దీంతో ఆ కుర్రాడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

లండన్‌లోని డెక్స్‌టర్‌ అనే ఏడేళ్ల కుర్రాడికి నాసా అంతరిక్ష యాత్రలో అంగారకగ్రహంపైకి ఇద్దరు వ్యోమగాముల్ని పంపుతున్నట్టు తెలిసింది. దీంతో ఆ బుడతడికి కూడా అంగారకుడిపైకి వెళ్లాలని ఆశకలిగింది. వెంటనే నాసాకు ఓ లెటర్‌ రాసేశాడు. 'ప్రియమైన నాసా, నా పేరు డెక్స్‌టర్‌, మీరు అంగారకుడిపైకి ఇద్దరు వ్యక్తుల్ని పంపుతున్నట్టు విన్నాను. నాకు కూడా రావాలని ఉంది. కానీ నా వయసేమో ఏడేళ్లే. నేనూ వ్యోమగామిని కావాలంటే ఏం చేయాలో చెబుతారా?' అంటూ తనకు వచ్చిన భాషలో లెటర్‌ రాసేశాడు. ఈ లెటర్‌ చదువుకున్న నాసా చక్కగా డెక్స్‌టర్‌కు బదులిచ్చింది. అది కూడా ఇలా అలా కాదు. పెద్ద పార్సిలే పంపింది. అందులో అంగారకుడికి సంబంధించిన ఫోటోలు, బొమ్మలు, ఇంకా ప్రత్యేకమైన స్టిక్కరు వంటివి బోలెడున్నాయి. వీటితోబాటు ఒక లెటర్‌ కూడా ఉంది. అందులో 'ప్రియమైన డెక్స్‌టర్‌! నువ్వు వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్లాలంటే మొదట చేయాల్సింది బాగా చదువుకోవడం. మంచి గ్రేడ్‌లు సాధించడం, మీ బడిలో జరిగే రోదసి శిబిరాల్లో చురుగ్గా పాల్గొనడం' అంటూ ఆ లేఖలో పలు సలహాలు, సూచనలతో డెక్స్‌టర్‌కు పంపింది. దీంతో డెక్స్‌టర్‌ తెగ మురిసిపోతున్నాడు.

  • Loading...

More Telugu News