: కంటినిండా నిద్ర కరవైతే.. కాపురం కష్టమేనట!


కంటినిండా నిద్రపోయిన రోజు ఆ హాయి చెప్పనలవికాదు. దినమంతా ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చేసే పనుల్లోనూ ఆ హుషారు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, నిద్రలేమి మాత్రం ఎంతో చికాకు కలిగిస్తుంది. కళ్ళ మంటలు అటుంచితే, మానసికంగా ఎంతో నిరాసక్తత ఆవరిస్తుంది. ఆ భారం కాస్తా అసహనంలా పరిణమించి జీవిత భాగస్వామిని విసుక్కునే వరకు వెళుతుందట. నిద్ర తక్కువైన రోజు.. మామూలు విషయాలను సైతం తీవ్రంగా పరిగణించి, వివాదాలకు తెరదీస్తారని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ఎంపిక చేసిన కొన్ని జంటలను పరిశీలించిన పిదప వారిమధ్య సఖ్యత చెడడానికి నిద్రలేమి కూడా కారణభూతమవుతోందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News