: పాక్ అధ్యక్షుడి సెక్యూరిటీ చీఫ్ దుర్మరణం
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రధాన భద్రత అధికారి బిలాల్ షేక్ నేడు ఓ ఆత్మాహుతి దాడిలో దుర్మరణం పాలయ్యారు. కరాచీలో పండ్లు కొనేందుకు మార్కెట్ కు వెళ్ళిన ఆయన సాయుధ వాహనంలోంచి కిందకు దిగే ప్రయత్నంలో ఉండగా.. ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో బిలాల్ తో పాటు మరో ఇద్దరు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. ఈ దాడికి బాధ్యులమని ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదని పోలీసులు తెలిపారు. కాగా, సెక్యూరిటీ ఛీఫ్ బిలాల్.. అధ్యక్షుడు జర్దారీకి నమ్మినబంటుగా పేరుగాంచారు.