: 100 మెగాపిక్సెల్ కెమెరా రూపొందించిన చైనా
చైనా శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా 100 మెగాపిక్సెల్ కెమెరాను అభివృద్ధి చేశారు. ఈ కెమెరా సాయంతో అత్యంత స్పష్టమైన ఛాయాచిత్రాలను తీయవచ్చని చైనా శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విమానాల్లోంచి, హెలికాప్టర్ల నుంచి ఈ కెమెరాతో హై రిజల్యూషన్ పిక్చర్స్ ను చిత్రీకరించవచ్చు. ఐఒఎ3 కాన్ బాన్ పేరిట ఈ కెమెరాను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆప్టిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ రూపొందించింది. మైనస్ 22 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ, 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఈ సూపర్ కెమెరాతో ఫొటోలు ఎంచక్కా తీయవచ్చట.