: మందులు లేకుండానే రక్తపోటు నియంత్రణ!
ఉరుకుల, పరుగుల జీవనం... బ్రష్ చేస్తున్న దగ్గర నుంచి బజ్జునే వరకూ తీరికలేని పరిస్థితి. తినేటప్పుడూ చెవికి మొబైల్ ఫోన్ వేలాడుతూ ఉండాల్సిందే. ఇంటా, బయటా ఒత్తిడులే. ఫలితంగా నేడు యుక్త వయసులోనే రక్తపోటు (బ్లడ్ ప్రెషర్/బీపీ) వచ్చేస్తోంది. దీనిని అదుపులో పెట్టుకోకుంటే చిన్న వయసులోనే గుండెకు ప్రమాదం. కిడ్నీలు పాడవుతాయి. పక్షవాతం ముప్పూ పొంచి ఉంటుంది. ఈ బీపీని మందుల కంటే కూడా.. తీసుకునే ఆహారంతోనే చక్కగా అదుపులో పెట్టుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఇందుకోసం సోడియం, షుగర్ తక్కువగా ఉండి, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజుకు ఐదారు సార్లు అయినా పండ్లు, కాయగూరలు తినాలి. బీట్ రూట్ జ్యూస్ చేసుకుని తాగితే బీపీ నియంత్రణలో ఉంటుందంటున్నారు. పండ్లు, కాయగూరలలో ఉండే, విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యాన్ని పటిష్ఠం చేస్తాయట.
పాలిష్ చేసిన బియ్యం కంటే కూడా ముతక బియ్యాన్నే వాడడం ఎంతో మంచిది. ఒక రోజులో ఎలా లేదన్నా మూడు రకాల ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా వీలైతే రోజూ ఉదయం, సాయంత్రం కొబ్బరి బోండాలు తాగండి. బీపీని అదుపులో పెట్టడంలో కొబ్బరి నీళ్లకు మించినది లేదట.

ఇక కొవ్వు అధికంగా ఉండే బటర్, చీజ్, స్వీట్లు, కేకులు వంటి బేకరీ పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. బదులుగా గుడ్డులోని తెల్లసొన, చేపలు, తీసుకుంటే వీటిలో ఉండే ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్లు రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడతాయని చెబుతున్నారు. అన్నింటికంటే ప్రధానమైనది మద్యపానం, ధూమపానానికి దూరం జరిగితే మంచిదంటున్నారు. క్రమం తప్పని వ్యాయామంతోనూ ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.