: ఆపిల్ సంస్థకూ తప్పని హ్యాకర్ల బెడద


ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లతో పాటు కంప్యూటర్ల తయారీ సంస్థలకూ హ్యాకర్ల బెడద తప్పడం లేదు. మొన్న ఫేస్ బుక్ పై మాల్వేర్ దాడులు జరిగినట్టు వార్తలు రాగా... తాజాగా కంప్యూటర్ దిగ్గజం ఆపిల్ కూడా హ్యాకింగ్ బారిన పడింది.

సంస్థ ఉద్యోగులకు చెందిన కొన్ని మాకింటోష్ కంప్యూటర్లపై హ్యాకర్లు తమ ప్రతాపం చూపినట్టు తెలుస్తోంది. ఇది ఆపిల్ సంస్థపై జరిగిన అతిపెద్ద సైబర్ దాడి అని కంపెనీ వర్గాలు అంటున్నాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతిని ఉద్ధేశించి గత వారం చేసిన ప్రసంగంలో..  దేశంలోని వివిధ వ్యవస్థలను సైబర్ దాడులను నుంచి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలిచ్చి వారం గడవక ముందే ఆపిల్ సంస్థ హ్యాకింగ్ కు గురికావడం విస్మయం కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News